మరోసారి రిలీజ్ డేట్ చెప్పిన గోపీచంద్

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై తెరకెక్కుతున్న ‘పక్కా కమర్షియల్’ కి సంబంధించి కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా జులై 1, 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు తెలిపారు.

గోపీచంద్ స్టైలిష్ లుక్ లో అడ్వకేట్ గా కనిపించనున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. సత్యరాజ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తూ అంచనాలు పెంచేసింది. ఈ చిత్రానికి జ‌ేక్స్ బిజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు SKN సహ నిర్మాత‌.

త్వరలోనే సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సినిమాలో మారుతి మార్క్ హిలేరియస్ కామెడీ ఆకట్టుకుంటుందని మేకర్స్ చెప్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ సరికొత్తగా కనిపించబోతున్నాడు. చాన్నాళ్ల తర్వాత ఆయన కామెడీ చేశాడు.