కొత్త సీన్స్‌తో ఆర్‌ఆర్‌ఆర్ రీలీజ్.. ఎక్కడంటే..

rrr-release-with-new-scenes-wherever

రీసెంట్‌గా బాక్సాఫీస్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రస్తుతం ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. అంతే కాదు ఈ సినిమాలోని డిలీటెడ్ సీన్స్‌ను యాడ్ చేసి చిత్రాన్ని థియేటర్లో మళ్లీ రిలీజ్ చేస్తున్నారట. ఆ వివరాలేంటో తెలుసుకుందామా!

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్టర్‌గా.. జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చరిత్రలోని ఇద్దరు నిజమైన సమరయోధుల బ్యాక్‌డ్రాప్ తీసుకుని వారి మధ్య ఫిక్షనల్ స్టోరీని అల్లి అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో జూనియర్‌ ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామారాజుగా కనిపించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 1200 కోట్లు వసూళ్లు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. జీఫైవ్ ఓటీటీలో ఈ నెల 20 న స్ట్రీమ్ కాబోతుంది. అయితే ఇదే సమయంలో చిత్ర యూనిట్ మరో నిర్ణయం కూడా తీసుకుంది. మూవీ నిడివిని తగ్గించేందుకు చిత్రం బృందం కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను కట్‌ చేశారట. అయితే ఇప్పుడు ఆ సీన్స్‌ను చూసే అవకాశం మళ్లీ కల్పించబోతున్నారు. కానీ అది ఇక్కడ కాదు, అమెరికాలో.
తొలగించిన సన్నివేశాలను అలాగే ఉంచి మళ్లీ ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేస్తున్నారు.

అమెరికాలో స్పెషల్‌ స్క్రీనింగ్‌ పేరుతో జూన్‌ 1న దాదాపు 100 థియేటర్లలో ఈ సినిమా సెకండ్ రిలీజ్ అవ్వబోతోంది. సినిమాలో తొలగించిన సన్నివేశాలను యథాతథంగా ఉంచి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకే ఈ స్పెషల్ షో అని ఆర్‌ఆర్‌ఆర్‌ టీం తెలిపింది. ప్రస్తుతం ఈ స్పెషల్ షో కోసం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.