ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రీ లుక్ ఇదే

NTR prashanth neel movie

కొన్ని కాంబినేషన్ల గురించి ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఆ లిస్టులో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబో ఒకటి. కేజీఎఫ్ 1 నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తారక్ ఓ యాక్షన్ సినిమా చేస్తే బాగుంటుందని కోరుకున్నారు. కేజీఎఫ్1 రిలీజైన వెంటనే ఎన్టీఆర్, ప్రశాంత్ తో ప్రాజెక్ట్ లాక్ చేసుకొని మైత్రీ నిర్మాతలతో అడ్వాన్స్ కూడా ఇప్పించాడు. ఈ విషయాన్ని ఆ నిర్మాతలే గతంలో ప్రకటించారు.

ఇలా ఈ కాంబోలో సినిమా రానుందని ఎప్పుడో ఎనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. ఎట్టకేలకు ఈ సినిమా నుంచి ప్రీ లుక్ రిలీజైంది. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రీ లుక్ పోస్టర్ తో అప్ డేట్ ఇచ్చి ఎన్టీఆర్ కి విషెస్ చెప్పారు మేకర్స్. తారక్ ముఖాన్ని క్లోజ్ గా చూపిస్తూ, ఇంటెన్స్ లుక్ తో వచ్చింది ఈ ప్రీ లుక్. ప్రశాంత్ నీల్ తన స్టయిల్ కు తగ్గట్టు బ్లాక్ షేడ్ లో ఈ ప్రీ లుక్ ను డిజైన్ చేయించాడు.

ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబో అంటే సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ భారీగా ఉంటాయి. ఇప్పుడు పోస్టర్ తో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. “ఇరవై ఏళ్ల నుండి నా మైండ్ లో ఉండిపోయిన డ్రీం ప్రాజెక్ట్ ను అదీ నా డ్రీం హీరోతో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అంటూ #NTR31 ప్రాజెక్ట్ గురించి ఓ నోట్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు ప్రశాంత్.

ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో కళ్యాణ్ రామ్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నవీన్ యర్నేని , రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.