మహేష్ బాబు తిన్న అతి చెత్త వంటకం

మహేష్ బాబు తిన్న అతి చెత్త వంటకం

మహేష్ బాబుకు కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్లడం ఇష్టం. అలా వెళ్లిన ప్రతిసారి రకరకాల వంటకాలు రుచిచూడడం ఇంకా ఇష్టం. ఈ క్రమంలో బాగా ఇష్టపడిన వంటకాలున్నాయి, అదే విధంగా బాగా అసహ్యించుకున్న వంటకాలు కూడా ఉన్నాయి. అలా మహేష్ అసహ్యించుకున్న వంటకం ఒకటి ఉంది.

“కొన్నేళ్ల కిందట కుటుంబంతో కలిసి థాయిలాండ్ వెళ్లాను. అక్కడ సముద్రపు వంటకాలు చాలా ఫేమస్ అనే విషయం అందరికీ తెలిసిందే. మేం కూడా ట్రై చేద్దామని ఓ వంటకం చెప్పాను. అదేదో చేప రకం. తెచ్చి నా ముందు పెట్టాడు. నేను నా జీవితంలో తిన్న అతి వింత వంటకం అదే. దాని పేరు కూడా నాకు గుర్తులేదు. ఆ టేస్ట్ అంత చెత్తగా ఉంది. మరోసారి అది టచ్ చేయను.”

ఇలా తన జీవితంలో తిన్న అతి చెత్త వంటకాన్ని బయటపెట్టాడు మహేష్ బాబు. రోజూ బిజీగా ఉండే తను సేదతీరేది కేవలం కుటుంబ సభ్యులతోనే మాత్రమేనని స్పష్టం చేసిన మహేష్.. రిలాక్స్ అవ్వడం కోసం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్తుంటానని చెప్పుకొచ్చాడు.