ఓటీటీలోకి ‘అశోకవనం..’

ఈ మధ్యకాలంలో హిట్టయిన చిన్న సినిమాలు ఏమైనా ఉన్నాయంటే అవి డీజే టిల్లూ, అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాలు మాత్రమే. హిట్టయిన వెంటనే డిజే టిల్లూ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకున్న ఆహా సంస్థ, అశోకవనంలో అర్జునకల్యాణం సినిమాను కూడా అదే విధంగా దక్కించుకుంది.

ప్రస్తుతం ఆహా వేదికగా డీజే టిల్లూ హంగామా చేస్తోంది. మంచి వ్యూయర్ షిప్ తెచ్చిపెడుతోంది. అదే ఊపులో అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాను కూడా స్ట్రీమింగ్ పెట్టాలని ఆహా నిర్ణయించింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 27న ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కు వస్తుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను ఆరున్నర కోట్ల రూపాయలకు ‘ఆహా’ దక్కించుకున్నట్టు తెలుస్తోంది.

లాంగ్ గ్యాప్ తర్వాత విశ్వక్ సేన్ ఈ సినిమాతో హిట్ కొట్టాడు. దీనికంటే ముందు పాగల్ లాంటి డిజాస్టర్ ఇచ్చాడు ఈ హీరో. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో కాస్ట్ లీ బెంజ్ కారు కూడా కొనుక్కున్నాడు. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా ఛానెల్ దక్కించుకుంది.