ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్.. 2022 సంవత్సరానికి గానూ తమ లేటెస్ట్ ప్రొడక్ట్స్‌ను అనౌన్స్ చేయబోతోంది. యాపిల్ ఏటా నిర్వహించే వరల్ట్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో తమ ప్రొడక్ట్స్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఆ ప్రొడక్ట్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
యాపిల్ డెవలపర్ కాన్ఫరెన్స్‌ను ఈ ఏడాది వర్చువల్ వేదికగా జూన్ 6 నుంచి 10 వరకు నిర్వహించనుంది. ఇందులో ప్రకటించబోయే ప్రొడక్ట్స్, వాటి ప్రత్యేకతల వివరాలివే..
ఐఓఎస్ 16
ఈ ఏడాది ఈవెంట్లో యాపిల్.. తన లేటెస్ట్ అప్డేటెడ్ ఐఓఎస్16ను విడుదల చేయనుంది. ఈ కొత్త ఐఓఎస్‌లో ఇంటర్ఫేస్ ట్వీక్స్, నోటిఫికేషన్స్, హెల్త్ యాప్, సర్వీసెస్ వంటి వాటిలో అప్డేట్స్ తీసుకొస్తున్నట్లు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకా ఈ ఓఎస్‌లో కార్ క్రాష్ డిటెక్షన్, ఎమర్జెన్సీ శాటిలైట్ ఫీచర్లు కూడా ఉండనున్నట్లు సమాచారం. అలాగే అప్డేటెడ్ వెర్షన్ హెల్త్ యాప్‌ను తీసుకురావడానికి కూడా యాపిల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
వాచ్ఓఎస్ 9
యాపిల్ స్మార్ట్‌వాచీల పనితీరును మెరుగుపరచడానికి వాచ్ఓఎస్ 9ను ప్రవేశపెట్టబోతోంది యాపిల్ . ఇందులో న్యూ పవర్ సేవింగ్ మోడ్‌తో పాటు, ఇతర లేటెస్ట్ ఫీచర్లు కూడా అప్డేట్ అవ్వనున్నాయని సమాచారం.
మ్యాక్ఓఎస్
మ్యాక్ యూజర్ల కోసం యాపిల్ .. కొత్త ఓఎస్‌ను తీసుకురానుంది. దీనిలో ఐదు కొత్త ఫీచర్లను అందించనుంది. వీటిలో విడ్జెట్స్ ఏనీవేర్, టైం మిషన్, వెథర్ యాప్, యాప్ లైబ్రరీ, ఐక్లౌడ్ బ్యాకప్స్, స్క్రీన్‌సేవర్స్ ఫర్ మ్యాక్ వంటి ఫీచర్లను కొత్తగా యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి.
టీవీఓఎస్ 16
యాపిల్ టీవీ యూజర్ల కోసం ఓ కొత్త ఓఎస్‌ను కంపెనీ ఇంట్రడ్యూస్ చేయనుంది. యాపిల్ టీవీ 4కే ఫస్ట్ జెనరేషన్, సెకండ్ జెనరేషన్ వాటితో పాటు ఫోర్త్ జెనరేషన్ యాపిల్ టీవీ ఫుల్ హెచ్డీ, హోంప్యాడ్ మినీ(2020), హోంప్యాడ్(2018) వంటి వాటిలోనూ ఈ కొత్త ఓఎస్ టీవీఓఎస్16 అప్డేట్ రానుంది.