టీఆర్‌ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే..

టీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభకు పోటీచేసే అభ్యర్థుల పేర్లు ఖరారు అయ్యాయి. మొత్తం మూడు స్థానాలకు గానూ.. మూడూ టీఆర్ఎస్ పార్టీకే ద‌క్క‌నున్నాయి. టీఆర్‌ఎస్ తరఫున ముగ్గురు అభ్యర్థుల పేర్ల‌ను పార్టీ అధిష్టానం ప్ర‌క‌టించింది.

డాక్టర్ బండి పార్థసారధి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్‌రావు పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. డాక్టర్ బండి పార్థసారధి రెడ్డి హెటిరో సంస్థ అధినేత. దీవ‌కొండ‌ దామోదర్‌ రావు కేసీఆర్‌కు తొలి నుంచి సన్నిహితుడు. గతంలో టీఆర్‌ఎస్ ట్రెజరర్‌గా కూడా పనిచేశారు. నమస్తే తెలంగాణ పత్రిక వ్యవహారాలను ప్రస్తుతం ఈయన పర్యవేక్షిస్తున్నారు. మ‌రో అభ్య‌ర్థి వద్దిరాజు రవిచంద్ర అలియాస్‌ గాయత్రి రవి ఖమ్మం జిల్లాకు చెందిన గ్రానైట్ వ్యాపారి.