నేను బ్రాండ్ తో రాలేదు.. బ్రాండ్ ఇండియాతో వచ్చాను

లక్కీ హ్యాండ్ పూజాహెగ్డే కాన్స్ చిత్రోత్సవంలో మెరిసింది. కాన్స్ రెడ్ కార్పెట్ పై డిజైనరీ దుస్తులు ధరించి క్యాట్ వాక్ చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆకట్టుకునే ప్రసంగం చేసింది పూజాహెగ్డే.

కాన్స్ చిత్రోత్సవానికి హీరోయిన్లంతా రకరకాల బ్రాండ్స్ తో వస్తారు. సౌందర్య ఉత్పత్తుల సంస్థలు హీరోయిన్లతో ఒప్పందాలు కుదుర్చుకొని, వాళ్లతో తమ బ్రాండ్స్ ను కాన్స్ లో ప్రచారం కల్పించుకుంటారు. కానీ పూజా హెగ్డే మాత్రం అలాంటి పనులు చేయలేదు. తను ఓ బ్రాండ్ తో ఒప్పందం కుదుర్చుకొని కాన్స్ కు రాలేదని, బ్రాండ్ ఇండియా ఇమేజ్ తో కాన్స్ లో అడుగుపెట్టానని పూజా సగర్వంగా ప్రకటించింది. ఆమె స్టేట్ మెంట్ కు హాల్ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది.

కాన్స్ లో క్యాట్ వాక్ చేయాలనే తన కోరిక ఇన్నాళ్లకు నెరవేరిందని, జీవితాంతం ఈ అనుభూతిని గుర్తుంచుకుంటానని పూజా హెగ్డే ప్రకటించింది. తను వచ్చింది కేవలం ఇండియన్ సినిమాను సెలబ్రేట్ చేయడానికి మాత్రమే అని స్పష్టం చేసింది. ఇండియన్ సినిమాను ప్రపంచం మొత్తం గుర్తిస్తోందని చెప్పుకొచ్చింది ఈ బుట్టబొమ్మ.