మేజర్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది

మేజర్ మొదటి రోజు వసూళ్లు

హీరో అడివి శేష్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. తెలుగు, హిందీ, మలయాళం భాషలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘మేజర్‘లో.. మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. ఇలా మేజర్ సందీప్ జీవితంలోని అపూర్వ సంఘటనలు, అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు గ్రిప్పింగా చూపించబోతున్నారు.

మ్యూజికల్ ప్రమోహన్స్ లో భాగంగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రం నుండి సెకెండ్ సింగల్ ”ఓహ్ ఇషా’ వీడియో సాంగ్ ఈ రోజు విడుదల చేశారు.

ఒక గెట్ టుగెదర్ లో ఆర్మీ అధికారులు తమ లైఫ్ పార్టనర్స్ తో డ్యాన్స్ చేస్తున్నపుడు మేజర్ సందీప్ గా శేష్ తన తొలిప్రేమ జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడంతో పాట మొదలౌతుంది. కాలేజీ డేస్ ప్రేమలో వుండే అందం, అమాయకత్వం ఈ పాటలో లవ్లీగా ప్రజంట్ చేశారు. 90’లో యంగ్ సందీప్ ఫస్ట్ లవ్ ని ఈ పాటలో అందంగా చూపించారు.

ఈ పాటలో శేష్, సాయి మంజ్రేకర్ జోడి చాలా క్యూట్ గా అలరించింది. అచ్చం కాలేజీ స్టూడెంట్ లానే అడివి శేష్ మేకోవర్ అయ్యాడు. ఈ లవ్లీ మోలోడీకి రాజీవ్ భరద్వాజ్ అందించిన సాహిత్యం కూడా అంతే హాయిగా అనిపించింది. అర్మాన్ మాలిక్, చిన్మయి పాటని మరింత శ్రావ్యంగా ఆలపించారు.

శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది.