కోడలిపై అత్యాచారం చేయబోయిన మామ.. చివరకు ఏమైందంటే..?

కోడలిపై అత్యాచారం చేయబోయిన మామ

వారిద్దరూ అన్యోన్యంగా ప్రేమించుకున్నారు. మూడు నెలల క్రితం పెద్దలను ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారు. కానీ కోడలికి అత్తవారింట ఓ ఆపద ఎదురైంది. సహజంగా అత్తలు సూటిపోటి మాటలతో వేధిస్తారు. కానీ ఇక్కడ 50ఏళ్ల మామ చూపులతో వేధించేవాడు. లైంగిక దాడికి ప్రయత్నించేవాడు. తరచూ ఇలాంటి సంఘటనలతో విసిగిపోయిన ఆ కొత్తకోడలు ఓసారి మామ వికృత చేష్టలను సెల్ ఫోన్ లో రికార్డ్ చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ధైర్యం సరిపోక ఆగిపోయింది. దీంతో మామ వేధింపులు మరింత పెరిగాయి. తాజాగా ఉదయాన్నే కోడలు పశువులకు గడ్డి వేసేందుకు వెళ్లగా మామ వెంబడించాడు. ఒంటరిగా దొరికే సరికి మరింత చొరవ తీసుకున్నాడు. అత్యాచారం చేయబోయాడు. అప్పటికే విసిగిపోయిన ఆ కోడలు కర్రతో ఆత్మరక్షణకోసం దాడి చేసింది. మామ అక్కడే తీవ్రంగా గాయపడి పడిపోయాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లా గోపాలపేట మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. తీవ్ర గాయాలపాలైన ఆ కీచకుడిని వనపర్తి ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే కాసేపటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు.

ఆస్తికోసమే..!
మృతుడి బంధువులు మాత్రం ఆస్తి కోసమే కోడలు, మామని దారుణంగా చంపేసిందని అంటున్నారు. ప్రేమ వివాహం తర్వాత కుటుంబంలో కలతలు చెలరేగాయని, ఆ తర్వాత ఇంటి పెద్ద ఇలా హతమయ్యాడని చెబుతున్నారు. కోడలిదే తప్పంతా అని ఆరోపిస్తున్నారు.

కోడలిపై హత్యకేసు..
ఆత్మరక్షణకోసం మామని చంపానంటోంది కోడలు. గతంలో మామ నీఛ ప్రవర్తనను తాను వీడియో కూడా తీశానంటూ సాక్ష్యం చూపెడుతోంది. అయితే మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు గోపాలపట్నం పోలీసులు కోడలిపై హత్యకేసు నమోదు చేశారు. కోడలు ఇచ్చిన ఫిర్యాదుని కూడా స్వీకరించి కేసు నమోదు చేశారు.