ప్రాజెక్ట్-కె షూటింగ్ అప్ డేట్స్

ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటి ప్రాజెక్ట్-కె. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలో అత్యంత భారీ బడ్జెట్ మూవీ ఇదే. దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో పాన్-వరల్డ్ మూవీగా ఇది తెరకెక్కుతోంది. సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. కానీ షూటింగ్ అప్ డేట్స్ మాత్రం రెగ్యులర్ గా బయటకు రావడం లేదు. ఎట్టకేలకు దర్శకుడు ఈ సినిమా అప్ డేట్స్ బయటపెట్టాడు.

ప్రాజెక్ట్-కె సినిమాకు సంబంధించి దర్శకుడు నాగ్ అశ్విన్ షూటింగ్ అప్ డేట్స్ బయటపెట్టాడు. ఈ మూవీకి సంబంధించి తాజాగా మరో షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్ లో సినిమాకు సంబంధించిన కొంత టాకీ పార్ట్ షూట్ చేశారు. మరీ ముఖ్యంగా సినిమాలో ప్రభాస్ ఇంట్రడక్షన్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు.

ఇక ప్రాజెక్ట్-కెకు సంబంధించి జూన్ నెలాఖరు నుంచి కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఆ షెడ్యూల్ లో ప్రభాస్-దీపిక పదుకునే జాయిన్ అవుతారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెగ్యులర్ గా అప్ డేట్స్ ఇవ్వనని దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రకటించాడు. ఎందుకంటే, ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాల్లో చిట్టచివరిగా విడుదలయ్యేది ఈ సినిమానే.

కాబట్టి ఇప్పట్నుంచే అప్ డేట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదని స్పష్టంచేశాడు నాగ్ అశ్విన్. ఇప్పట్లో ప్రాజెక్ట్-కె ఫస్ట్ లుక్ కు సంబంధించి ప్రకటన రాదని క్లారిటీ ఇచ్చేశాడు.