థాంక్యూ రిలీజ్ డేట్ ఫిక్స్

‘మనం’ లాంటి ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌ తరువాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ల కలయికలో రాబోతున్న మరో చిత్రం ‘థాంక్యూ’. ఇప్పటివరకు ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలను అందించిన శ్రీవెంకటేళ్వర క్రియేషన్స్‌ సంస్థ నిర్మాణంలో ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, మాళవిక నాయర్‌లు హీరోయిన్లు.

ఈ చిత్రాన్ని జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో నాగచైతన్య కూల్‌అం‌డ్‌ స్టయిలిష్‌ లుక్‌ అందరిని ఆకట్టుకుంటుంది. నాగచైతన్య కెరీర్‌లో మరపురాని చిత్రంగా నిలిచిపోయేలా ఈ సినిమా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

లెజండరీ సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్‌ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈచిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. బీవీఎస్‌ రవి కథను అందించిన ఈ చిత్రానికి నవీన్‌ నూలి ఎడిటర్.

నిజానికి కాస్త ఆలస్యంగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. థాంక్యూ షూటింగ్ పూర్తయిన వెంటనే ఓ వెబ్ సిరీస్ కు షిఫ్ట్ అయ్యాడు నాగచైతన్య. దానికి కూడా విక్రమ్ కుమారే దర్శకుడు. అది కూడా పూర్తయిన తర్వాత విడుదల తేదీని ఎనౌన్స్ చేశారు. నాగచైతన్య కెరీర్ లో ఇదొక డిఫరెంట్ మూవీ అవుతుందని అంతా భావిస్తున్నారు. ఈ సినిమా స్టోరీపై ఇండస్ట్రీలో చాలా క్యూరియాసిటీ నెలకొని ఉంది.