సర్కారువారి పాట మొదటి రోజు వసూళ్లు

సర్కారువారి పాటపై ఉన్న అంచనాల గురించి అందరికీ తెలిసిందే. లాంగ్ గ్యాప్ తర్వాత మహేష్ బాబు నుంచి వస్తున్న సినిమా కావడం, ట్రయిలర్ సూపర్ హిట్టవ్వడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగడంతో.. మొదటి రోజు సర్కారువారి పాట సినిమా మెరిసింది.

తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సినిమాకు ఏకంగా 36 కోట్ల 63 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఈ విషయాన్ని మేకర్స్ స్వయంగా వెల్లడించారు. మిగతా సినిమాలకు భిన్నంగా, మొదటి రోజు వసూళ్లను అఫీషియల్ గా బయటపెట్టారు. అది కూడా గ్రాస్ రూపంలో కాకుండా, షేర్ లెక్కల్లో.

సర్కారువారి పాట సినిమా మొదటి రోజు వసూళ్లను ఆల్ టైమ్ డే-1 రికార్డ్ గా చెప్పుకొచ్చింది సినిమా యూనిట్. కాకపోతే ఆర్ఆర్ఆర్ సినిమా దీనికి మినహాయింపు. నాన్-ఆర్ఆర్ఆర్ అంటూ చెబుతూనే, ఆల్ టైమ్ డే-1 రికార్డ్ ను క్లెయిమ్ చేసుకుంది ఈ సినిమా యూనిట్.

ఈ సినిమాకు నైజాం నుంచి 12 కోట్ల 24 లక్షల రూపాయల షేర్ (జీఎస్టీలు కాకుండా) వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది 9 కోట్లు మాత్రమే వచ్చాయని వాదిస్తుండగా, యూనిట్ మాత్రం 12 కోట్లకు ఫిక్స్ అయింది. ఇక ఆంధ్రా నుంచి 24 కోట్ల 39 లక్షల రూపాయలు వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో సర్కారువారి పాటకు మొదటి రోజు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి
నైజాం – రూ. 12.24 కోట్లు
సీడెడ్ – రూ. 4.7 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.73 కోట్లు
ఈస్ట్ – రూ. 3.25 కోట్లు
వెస్ట్ – రూ. 2.74 కోట్లు
గుంటూరు – రూ. 5.83 కోట్లు
కృష్ణా – రూ. 2.58 కోట్లు
నెల్లూరు – రూ. 1.56 కోట్లు