ఆర్ఆర్ఆర్ ఓటీటీ ట్రయిలర్ అదిరింది

ఇండియాస్ బిగ్గెస్ట్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ‘జీ 5’లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్ ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ షో చూడటానికి ఆడియన్స్ రెడీ అయ్యారు. ఈ డిజిటల్ ప్రీమియర్ పై మరిన్ని అంచనాలు పెంచేందుకు.. ప్రత్యేకంగా ట్రయిలర్ రిలీజ్ చేసింది జీ5. అంటే.. ఇది ఆర్ఆర్ఆర్ ఓటీటీ ట్రయిలర్ అన్నమాట.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా దర్శకుడు రాజమౌళి రూపొందించిన దృశ్య కావ్యం ‘ఆర్ఆర్ఆర్’. మే 20వ తేదీన ‘జీ 5’ ఓటీటీ వేదికలో తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో సినిమాను వీక్షకుల ముందుకు తీసుకొస్తోంది. దీనికి సంబంధించి ఈరోజు విడుదల చేసిన ట్రయిలర్ అదిరింది. ఒరిజినల్ ట్రయిలర్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఆర్ఆర్ఆర్ ఓటీటీ ట్రయిలర్ ఉంది. మరోసారి సినిమాను చూడాలనే ఆసక్తి కలిగించింది.

నేటికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలై 50 రోజులు. మే 20వ తేదీన యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కూడా! ఆయన అభిమానులకు కానుకగా డిజిటల్ తెరపైకి ఆర్ఆర్ఆర్ ను జీ5 తీసుకొస్తోంది. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కు ఏమాత్రం తీసిపోని విధంగా.. 4k క్వాలిటీ విజువల్, డాల్బీ డీటీఎస్ సౌండ్ లో ఈ సినిమాను చూసి ఆనందించవచ్చు.

ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో వసూళ్ల పరంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రికార్డులు సృష్టించింది. 11 వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది.