కొడుకు హీరోగా రాజుగారి మరో సినిమా

నిర్మాత ఎం.ఎస్ రాజు దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. గతేడాది తన దర్శకత్వంలో వచ్చిన డర్టీ హరి చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎం.ఎస్.రాజు, మరింత వైవిధ్యమైన, వినూత్నమైన కథలతో వస్తున్నారు. ఇటీవల అయన దర్శకత్వం వహించిన 7 డేస్ 6 నైట్స్ విడుదలకి సిద్ధంగా ఉండగానే, ‘సతి’ అనే పేరుతో తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు రాజు.

సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని ఎం.ఎస్.రాజు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. కొత్తగా పెళ్ళైన భార్యభర్తల మధ్య జరిగే అనుకోని సంఘటనల చుట్టూ అల్లిన కథతో, ఉద్వేగభరితమైన సన్నివేశాలతో ఈ ‘సతి’ రాబోతోంది.

తన దర్శకత్వ కెరీర్ లోనే గర్వంగా చెప్పుకోదగ్గ చిత్రంగా ‘సతి’ నిలుస్తుందని చెబుతున్నారు ఎం.ఎస్.రాజు. సీనియర్ నటుడు నరేష్ ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పనులు నడుస్తున్నాయి. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్, రమంత్ర క్రియేషన్స్ బ్యానర్స్ పై వస్తున్న ఈ సినిమా కథ కూడా ఎం.ఎస్.రాజుదే కావడం విశేషం.