రూ.22 లక్షలతో బ్యాంకు క్యాషియర్ పరార్

హైదరాబాద్ వనస్థలీపురం సాహెబ్ నగర్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లో ఓ ఉద్యోగి 22 లక్షలతో పరారయ్యాడు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో క్యాషియర్ గా పని చేస్తున్న ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి నిన్న మధ్యాహ్నం కడుపునొప్పిగా ఉందని, టాబ్లెట్ తెచ్చుకుంటానని మేనేజర్ దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోయాడు. నిన్న బ్యాంకు మూసే సమాయానికి కూడా అతను రాకపోవడంతో చీఫ్ మేనేజర్ విజయ్ కుమార్ కు అనుమానం వచ్చి డబ్బులు లెక్కించగా 22 లక్షల 53 వేలు మాయమయ్యాయని తెలిసింది.
నిన్నటి నుండి ప్రవీణ్ కుమార్ ఇంటికి కూడా వెళ్ళలేదని సమాచారం. కుటుంబ సభ్యులకు కూడా ఆయన అందుబాటులోకి లేనట్టు తెలుస్తోంది.

క్యాషియర్ ప్రవీణ్ కుమార్ డబ్బులు తీసుకొని పారి పోయాడనే విషయం అర్ద‌మైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఛీఫ్ మేనేజర్ వనస్థలీ పురం పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రవీణ్ కుమార్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.