రంగరంగ వైభవంగా వైష్ణవ్ తేజ్

ఉప్పెన సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన యువ హీరో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా, శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తోన్న చిత్రానికి ‘రంగ రంగ వైభ‌వంగా’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. కేతికా శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. ఈరోజు ఈ సినిమా టైటిల్ టీజ‌ర్‌, ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర‌యూనిట్ రిలీజ్ చేసింది.

టీజ‌ర్ గ‌మ‌నిస్తే యూత్‌ని మెప్పించేలా ఉంది. ఇందులో హీరో, హీరోయిన్ మ‌ధ్య న‌డిచే బ‌ట‌ర్ ఫ్లై కిస్ థియ‌రీ కొత్త‌గా అనిపిస్తుంది. టీజర్ చూస్తే, ఇది పూర్తిగా యూత్ మూవీ అనే విషయం అర్థమౌతోంది. వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జోడీ చూడ్డానికి చాలా బాగుంది.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం టీజ‌ర్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లింది. అర్జున్ రెడ్డి త‌మిళ వెర్ష‌న్ డైరెక్ట్ చేసిన గిరీశాయ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించేలా రూపొందుతోన్న ఈ చిత్రానికి శామ్ ద‌త్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ కు కెరీర్ లో ఇది మూడో సినిమా. ఉప్పెనతో హీరోగా పరిచయమైన ఈ హీరో, తన రెండో ప్రయత్నంగా కొండపొలం సినిమా చేశాడు.