ప్రభాస్ రూ. 50 కోట్లు అడ్వాన్స్

ప్రస్తుతం ప్రభాస్ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది. అతడితో సినిమా చేసేందుకు కోట్ల రూపాయలు ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. అందుకు తగ్గట్టే ఒక్కో సినిమాకు అటుఇటుగా వంద కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు ప్రభాస్. ఇందులో భాగంగా అతడు అందుకునే అడ్వాన్సులు కూడా సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా 50 కోట్ల అడ్వాన్స్ అందుకొని రికార్డ్ సృష్టించాడు ప్రభాస్.

డీవీవీ దానయ్య బ్యానర్ లో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు ప్రభాస్. ఈ మేరకు సంతకాలు కూడా అయిపోయాయి. అడ్వాన్స్ కింద దానయ్య ఏకంగా ప్రభాస్ కు 50 కోట్ల రూపాయలు ఇచ్చాడట. ఓ సినిమాకు అడ్వాన్స్ కింద ఇంత మొత్తం ఇవ్వడం టాలీవుడ్ చరిత్రలోనే ప్రథమం. అలా ఈ అడ్వాన్స్ పేమెంట్ మేటర్ హాట్ టాపిక్ అయింది.

అయితే ఈ ప్రాజెక్టు ఇప్పట్లో సెట్స్ పైకి రాదు. ఇంకా చెప్పాలంటే దర్శకుడు, కథ లాంటివి కూడా ఫిక్స్ అవ్వలేదు. మంచి దర్శకుడు, సరైన స్టోరీ దొరికినప్పుడు ప్రాజెక్టు పట్టాలపైకి వస్తుంది. ఈలోగా తన చేతిలో ఉన్న 3 సినిమాల్ని పూర్తిచేస్తాడు ప్రభాస్.