మిస్టర్ ప్రెగ్నెంట్ సక్సెస్ అయ్యాడు

‘కథ వేరుంటది’ అనే డైలాగ్ తో గతేడాది బిగ్ బాస్ కార్యక్రమంలో హల్ చల్ చేశాడు సయ్యద్ సోహెల్. వీక్షకుల మనసు గెలుచుకున్న ఈ కుర్రాడు.. బిగ్ బాస్ లో టాప్ త్రీ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నాడు. టైటిల్ గెలవలేకపోయినా, టాలీవుడ్ హాట్ ఫేవరెట్ అయ్యాడు. సోహెల్ హీరోగా వస్తోన్న సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. టైటిల్ తోనే అందర్నీ ఆకట్టుకున్న ఈ సినిమాలోని లిరికిల్ సాంగ్ కు ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తోంది.

కథ వేరుంటది అంటూ సాగే ఈ పాట… కుర్రకారుని విపరీతంగా ఆకట్టుకుంటోంది. జార్జ్ రెడ్డి, ప్రెషర్ కుక్కర్ సినిమాలతో టాలీవుడ్ లో పేరుతెచ్చుకున్న మైక్ మూవీస్ బ్యానర్లో వస్తోన్న సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్. ఈ సినిమాలో సయ్యద్ సోహెల్ సరసన రూప హీరోయిన్ గా నటిస్తోంది. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. బుల్లెట్ బండి పాటతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన మోహన భోగరాజు…ఈ పాటని పాడడం విశేషం.

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రెగ్నెంట్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో తనకు మంచి గుర్తింపు రావడం ఖాయం అని అంటున్నాడు సోహెల్. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, సజ్జర రవిరెడ్డి నిర్మిస్తున్న ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకు శ్రీనివాస్ వింజనంపాటి దర్శకుడు. సుహాసిని మణిరత్నం, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ ఇతర పాత్రల్లో నటించారు.