నాగశౌర్య సినిమాకు డిఫరెంట్ టైటిల్

హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య ఈమధ్య కొత్త కథలు ఎంచుకుంటున్నాడు. ఇందులో భాగంగా తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈరోజు నాగశౌర్య పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేక‌ర్స్‌. కృష్ణ వ్రింద విహారి అనే ఈ టైటిల్‌ ఎంతో ట్రెడిషనల్‌గా, కొత్త‌గా ఉంది. కృష్ణ, వ్రింద అనేవి హీరో హీరోయిన్ల పాత్ర‌ల పేర్లు అని తెలుస్తోంది. టైటిల్‌ను డిజైన్ చేసిన విధానం కూడా చక్కగా కుదిరింది.

ఈ పోస్టర్‌లో నాగ శౌర్య అందరినీ మెప్పించేలా ఉన్నాడు. నిలువు బొట్టుతో బ్రాహ్మణుడిగా కనిపించాడు. పోస్టర్ చూస్తుంటే పెళ్లి తంతులా ఉంది. మొత్తానికి పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

ఇప్ప‌టివ‌ర‌కు నాగ శౌర్య చేసిన పాత్రలన్నింటి కంటే ఈ రోల్ డిఫరెంట్‌గా ఉండబోతోంది అని తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగశౌర్య పూర్తిగా స‌రికొత్త‌ పాత్రలో కనిపించబోతోన్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్త‌య్యింది. ఒక్క పాట చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. షిర్లే సెటియా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియ‌ర్ న‌టి రాధిక ఈ సినిమాలో ముఖ్య పాత్రను పోషించారు.