ఇప్పుడు భీమ్లానాయక్ వంతు

ఆర్ఆర్ఆర్ నుంచి ఇప్పటికే 2 రిలీజ్ డేట్స్ వచ్చాయి. కుదిరితే మార్చి 18, కుదరకపోతే ఏప్రిల్ 28 రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు భీమ్లానాయక్ కూడా ఇదే బాట పట్టింది. ఒకే తేదీకి ఫిక్స్ అయి, ఆ తర్వాత ఏదో ఒక అడ్డంకితో వాయిదా వేసి మాట పడే కంటే.. ఆర్ఆర్ఆర్ టైపులో 2 రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేయాలని భావిస్తున్నారు.

లెక్కప్రకారం భీమ్లానాయక్ ఫిబ్రవరి 25కు థియేటర్లలోకి రావాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. అప్పటికి, అంటే మరో నెల రోజులకి తెలుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు సద్దుమణిగేలా కనిపించడం లేదు. అందుకే భీమ్లానాయక్ మేకర్స్, ఇప్పుడు ఏప్రిల్ 1 తేదీపై కూడా కన్నేశారు. ఒకవేళ వచ్చేనెల థియేటర్లలోకి రాలేకపోతే, ఏప్రిల్ 1కి వస్తామని ప్రకటించబోతున్నారు మేకర్స్.

కానీ ఇప్పటికే ఏప్రిల్ 1కి ఆచార్య సినిమా రెడీగా ఉంది. ఈమధ్యే విడుదల తేదీ ప్రకటించారు. సో.. భీమ్లా నాయక్ ఆ తేదీకి వచ్చే ఛాన్స్ లేదు. ఆచార్యకు కాస్త అటుఇటుగా మరో తేదీని ప్రకటించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. త్వరలోనే భీమ్లానాయక్ నుంచి ఆ మేరకు ఓ కొత్త పోస్టర్ వచ్చే అవకాశం ఉంది.