టాలీవుడ్ లో మరో కరోనా కేసు

టాలీవుడ్ ను థర్డ్ వేవ్ వణికిస్తూనే ఉంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడగా.. తాజాగా ఈ లిస్ట్ లోకి దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా చేరాడు. తనకు కరోనా సోకిన విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు ఈ దర్శకుడు. దయచేసి కరోనాను అందరూ సీరియస్ గా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.

సెకెండ్ వేవ్ తో పోలిస్తే థర్డ్ వేవ్ ఏమంత ప్రమాదకరంగా కనిపించడం లేదు. లక్షణాలు ఉంటున్నాయి కానీ, డెల్టా వేరియంట్ తరహాలో ప్రాణాపాయం మాత్రం లేదు. అయినప్పటికీ టాలీవుడ్ జనాలంతా జాగ్రత్తగా ఉంటున్నారు. పెద్ద సినిమాల షూటింగ్స్ అన్నీ ఎప్పుడో నిలిచిపోయాయి. పార్టీలు కూడా తగ్గిపోయాయి. అయినప్పటికీ ఎవరో ఒకరు, ఎక్కడో ఒక చోట కరోనా బారిన పడుతూనే ఉన్నారు. తరుణ్ భాస్కర్ కు కూడా అలానే కరోనా సోకింది.

శర్వానంద్ హీరోగా నటించిన ఒకే ఒక జీవితం సినిమాకు మాటలు అందించాడు తరుణ్ భాస్కర్. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఓరి దేవుడా అనే రీమేక్ సినిమాకు కూడా ఇతడే డైలాగ్స్ అందిస్తున్నాడు.