ఆ సినిమా పేరు ‘అనగనగా ఒక రాజు’

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నవీన్ పొలిశెట్టి హీరోగా సినిమా ఎనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ భార్య సాయిసౌజన్య ఈ సినిమాకు సహ-నిర్మాత. ఇప్పుడీ సినిమాకు టైటిల్ ఎనౌన్స్ చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేసి మరీ టైటిల్ ను ప్రకటించారు. ఈ సినిమాకు అనగనగా ఒక రాజు అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

కామెడీ టైమింగ్ కు పెట్టింది పేరు నవీన్ పొలిశెట్టి. జాతిరత్నాలు సినిమాలో ఇతడి కామెడీ టైమింగ్ అద్భుతం. ఇప్పుడీ వీడియోలో కూడా తన టాలెంట్ చూపించాడు నవీన్. అదిరిపోయే డైలాగ్ డెలివరీతో వీడియోకు అందం తీసుకొచ్చాడు.

వీడియోను నిశితంగా గమనిస్తే ఏదో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు, హడావుడి గమనించవచ్చు. పెళ్ళికొడుకుగా నవీన్ తయారవుతున్న తీరు కనిపిస్తుంది. ఫోటో షూట్ జరుగుతూ ఉంటుంది.. ఈ బ్యాక్ డ్రాప్ లో టైటిల్ రివీల్ చేశారు.

కల్యాణ్ శంకర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. త్వరలోనే ఈ కామెడీ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.