ఉగాది కానుకగా ఆచార్య.. కొత్త రిలీజ్ డేట్

మెగాస్టార్ చిరంజీవి, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించారు. ఉగాది కానుకగా ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది ఆచార్య సినిమా.

చిత్ర నిర్మాత‌ నిరంజ‌న్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఆచార్య చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేయాలనుకున్నాం. కానీ కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను విడుదల చేయడం భావ్యం కాదనిపించింది. అందువల్ల సినిమాను ఫిబ్రవరి 4న కాకుండా ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తున్నాం. ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్న సినిమా వాయిదా ప‌డ‌టం అనేది మెగా ఫ్యాన్స్‌కు నిరాశ క‌లిగించే అంశ‌మే. అయితే, ఈ వెయిటింగ్‌కు త‌గ్గ ఫ‌లితం ఉంటుంద‌ని గ్యారంటీగా చెప్ప‌గ‌లం. ఉగాది సంద‌ర్భంగా ‘ఆచార్య’ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఫ్యాన్స్ ఎంత ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నారో మేం కూడా అంతే ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాం’’ అన్నారు.

కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. సినిమాలో చిరంజీవి సరసన కాజల్, చరణ్ సరసన పూజాహెగ్డే హీరోయిన్లుగా నటించారు. సోనూ సూద్ విలన్ గా కనిపించనున్నాడు.