బంగార్రాజు మొదటి రోజు వసూళ్లు

నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటించిన బంగార్రాజు సినిమా మొదటి రోజు మంచి వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 17 కోట్ల 50 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ ఇదే. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు తగ్గించడం వల్ల వసూళ్లు ఇలా ఉన్నాయి. లేకపోతే 20 కోట్ల రూపాయల గ్రాస్ అందుకునేది ఈ సినిమా.

సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్ గా వచ్చిన బంగార్రాజుకు సంక్రాంతి బరిలో సోలో రిలీజ్ దొరికింది. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా సినిమాలు తప్పుకోవడం.. పుష్ప, అఖండ సినిమాలకు థియేటర్లలో క్రేజ్ తగ్గడంతో బంగార్రాజుకు పుష్కలంగా థియేటర్లు దొరికాయి. ఈ అడ్వాంటేజ్ ను సరిగ్గా ఉపయోగించుకుంది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన వసూళ్లు (షేర్లు) ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 2.03 కోట్లు
సీడెడ్ – రూ. 1.74 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.24 కోట్లు
ఈస్ట్ – రూ. 76 లక్షలు
వెస్ట్ – రూ. 65 లక్షలు
గుంటూరు – రూ. 89 లక్షలు
నెల్లూరు – రూ. 34 లక్షలు
కృష్ణా – రూ. 46 లక్షలు