కీలకమైన మీటింగ్ మిస్సయిన నాగ్

ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి సమావేశం జరిగినా దానికి చిరంజీవి-నాగార్జున కలిసి వెళ్తారు. ఇది అనాదిగి వస్తున్న ఆచారం. ప్రభుత్వంతో జరిగే చర్చల్లో చిరంజీవి ఉంటే పక్కన నాగ్ ఉండాల్సిందే. నాగ్ ఉంటే, ఆ పక్కనే చిరంజీవి ఉండాల్సిందే. అలాంటి అనుబంధం వీళ్లిద్దరిది. అయితే ఆశ్చర్యంగా ఈసారి మాత్రం నాగార్జున మిస్సయ్యారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చిరంజీవి మధ్య అత్యంత కీలకమైన మీటింగ్ ఈరోజు జరిగింది. సీఎం ఆహ్వానం మేరకు తాడేపల్లి వెళ్లిన చిరంజీవి.. జగన్ తో కలిసి లంచ్ చేశారు. ఆ తర్వాత ఏపీలో తగ్గించిన టికెట్ రేట్ల అంశంపై మాట్లాడారు. అయితే ఈసారి నాగ్ మిస్సవ్వడం అందర్లో అనుమానాలు పెంచింది.

దీనిపై వెంటనే రియాక్ట్ అయ్యారు నాగార్జున. బంగార్రాజు సినిమా ప్రచారంలో ఉండడం వల్ల చిరంజీవితో కలిసి మీటింగ్ కు హాజరుకాలేకపోయానని వెల్లడించారు. మరీ ముఖ్యంగా బంగార్రాజుకు సంబంధించి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టుకున్నారు. ఆ ఫంక్షన్ కు హాజరవ్వడం కష్టమని భావించి నాగార్జున మీటింగ్ కు వెళ్లలేదు. ఇదే విషయాన్ని ఈరోజు మీడియాకు చెప్పారు. చిరంజీవి-జగన్ మధ్య మంచి అనుబంధం ఉందని, ఈరోజు జరిగిన మీటింగ్ వల్ల ఇండస్ట్రీకి మంచి జరుగుతుందన్నారు నాగార్జున.