‘అలా’ సెలబ్రేట్ చేస్తున్న పూజా హెగ్డే

అల వైకుంఠపురములో సినిమా రిలీజై ఇవాళ్టికి సరిగ్గా రెండేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా పూజా హెగ్డే మరోసారి సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. పొద్దున్నుంచి వరుసగా వీడియోలు పెడుతూ హల్ చల్ చేస్తోంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కు, బన్నీకి, త్రివిక్రమ్ కు మరోసారి థ్యాంక్స్ చెప్పింది ఈ బుట్టుబొమ్మ.

‘అల వైకుంఠపురములో’ సినిమా రిలీజైనప్పుడు ఆ పాటలు ఎంత హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. థియేటర్లలో ఆ పాటలకు ఆడియన్స్ డాన్సులు చేశారు. అలాంటి వీడియోల్ని మార్నింగ్ నుంచి షేర్ చేస్తోంది పూజ. ఇక అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హతో కలిసి మేకప్ రూమ్ లో ‘అల వైకుంఠపురములో’ పాటలకు డాన్స్ చేసిన అన్-సీన్ వీడియోను కూడా పూజా హెగ్డే షేర్ చేసింది.

ఈ సినిమాను పూజా హెగ్డే ఇంతలా సెలబ్రేట్ చేయడానికి ఓ కారణం ఉంది. అల వైకుంఠపురములో సినిమా పూజా హెగ్డే కెరీర్ కు టర్నింగ్ పాయింట్. ఈ సినిమా తర్వాత ఆమె స్టార్ అయిపోయింది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. అందుకే ‘అల వైకుంఠపురములో’ సినిమాను తన కెరీర్ లో వెరీ వెరీ స్పెషల్ మూవీగా చూస్తుంది పూజా హెగ్డే.