రాధేశ్యామ్ కూడా వాయిదా పడింది

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఇండియాస్ బిగ్గెస్ట్ లవ్ స్టోరీ రాధే శ్యామ్. ఒమిక్రాన్ వైరస్ కారణంగా ఈ సినిమాను వాయిదా వస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ప్రకటించారు. ఈ సంక్రాంతికి సినిమా రిలీజ్ అవ్వడం లేదన్నమాట.

సినిమా వాయిదా గురించి నిర్మాతలు మాట్లాడుతూ… ‘గత కొన్ని రోజులుగా సినిమా కోసం చాలా ప్రయత్నించాం.. కానీ ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితులు.. పెరిగిపోతున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసుల నేపథ్యంలో.. ఈ అద్భుతమైన ప్రేమకథను థియేటర్స్‌లో ఎంజాయ్ చేయడానికి మరికొన్ని రోజుల సమయం పడుతుంది. విధికి, విధిరాతకు మధ్య జరిగే అద్భుతమైన ప్రేమకథ ఇది. మాకు తెలుసు.. మీ ప్రేమ సినిమాపై ఎప్పుడూ ఇలాగే ఉంటుందని.. ఎప్పుడు బిగ్ స్క్రీన్‌పై వచ్చినా కూడా సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం..’ అని తెలిపారు.

యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. ఓటీటీలో ఈ సినిమాను నేరుగా రిలీజ్ చేయబోతున్నారంటూ నిన్నటివరకు ఈ సినిమాపై ప్రచారం కూడా జరిగింది. థియేటర్లలోనే రాధేశ్యామ్ ను రిలీజ్ చేస్తామంటూ క్లారిటీ ఇచ్చి, పుకార్లు కొట్టివేశారు నిర్మాతలు. తాజా సమాచారం ప్రకారం.. మార్చి 18కి రాధేశ్యామ్ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు.