సంక్రాంతికి ఏకంగా 10 సినిమాలు

ఈ సంక్రాంతి ఎటూకాకుండా పోయింది. భీమ్లానాయక్ ను సైడ్ చేశారు ఆర్ఆర్ఆర్ మేకర్స్. పవన్ సినిమా సైడ్ అయిన కొన్ని రోజులకే ఆర్ఆర్ఆర్ కూడా వాయిదా పడింది. అంతకంటే ముందే సర్కారువారి పాట పోస్ట్ పోన్ అయింది. రాధేశ్యామ్ వస్తుందో రాదో తెలియని పరిస్థితి. దీంతో ఈ సంక్రాంతికి చిన్న సినిమాలు క్యూ కట్టాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి

జనవరి 7కి రానా నటించిన 1945, ఆర్జీవీ మిస్సింగ్, అతిథి దేవోభవ సినిమాలు లైన్లో ఉన్నాయి. వీటితో పాటు ఏవమ్ జగత్ అనే మరో చిన్న సినిమా కూడా వచ్చేలా ఉంది. ఇక జనవరి 12న అజిత్ నటించిన డబ్బింగ్ మూవీ బలం పేరిట రిలీజ్ అవుతోంది. ఇక అసలైన రోజు జనవరి 14న ఏకంగా 5 సినిమాలు (ప్రస్తుతానికి) క్యూ కట్టాయి. వీటిలో రౌడీ బాయ్స్, హీరో, సూపర్ మచ్చి, డీజే టిల్లూ, 6 నైట్స్ 7 డేస్ సినిమాలున్నాయి.

ఇవి కాకుండా మరో 2 సినిమాల ప్రకటనలు కూడా రేపోమాపో వచ్చేలా ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే ఈ సంక్రాంతికి దాదాపు 10 సినిమాలున్నాయి. నాగ్ నటించిన బంగార్రాజు వస్తుందా రాదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.