ఆర్ఆర్ఆర్ రావాల్సింది.. ఆది వస్తున్నాడు

జనవరి 7.. ఈ తేదీ చెప్పగానే గుర్తొచ్చే సినిమా ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ కళ్లుకాయలుకాచేలా ఎదురుచూశారు. కట్ చేస్తే, సినిమా పోస్ట్ పోన్ అయింది. అభిమానుల్ని నిరాశపరిచింది. ఇప్పుడీ తేదీకి ఆది సాయికుమార్ వస్తున్నాడు.

ఆది సాయి కుమార్, నువేక్ష హీరోహీరోయిన్లుగా న‌టించిన చిత్రం ‘అతిధి దేవోభవ’. శ్రీనివాస క్రియేషన్స్ ప‌తాకంపై తెరకెక్కిన ఈ సినిమాకు పొలిమేర నాగేశ్వర్ దర్శకుడు. ఇటీవ‌లే ఈ సినిమా నుండి మొద‌టిపాట‌గా ఓ ప్రేమ గీతాన్ని విడుద‌ల‌చేశారు. ఆ పాట సూపర్ హిట్టయింది. ‘బాగుంటుంది నువ్వు నవ్వితే’ అనే లిరిక్స్ తో సాగిన ఆ పాటను సిద్‌ శ్రీ‌రామ్ పాడాడు. శేఖర్ చంద్ర ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసేందుకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు మేకర్స్. జ‌న‌వ‌రి 7న ఈ సినిమా రాబోతుంది. చాన్నాళ్లుగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న ఆది సాయికుమార్, ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.