కన్ఫర్మ్ చేసిన కాజల్

కొత్త ఏడాది సరికొత్త న్యూస్ మోసుకొచ్చింది కాజల్ అగర్వాల్. తను గర్భం దాల్చిన విషయాన్ని పరోక్షంగా వెల్లడించింది. నూతన సంవత్సరం సందర్భంగా భర్త గౌతమ్ తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది కాజల్. అందులో కాజల్ గర్భందాల్చిన విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఇద్దరూ గర్భంపై చేయి వేసి ఫొటో దిగడంతో అసలు విషయం చెప్పకనే చెప్పినట్టయింది. కాజల్ మాత్రం ఏం చెప్పలేదు. జస్ట్ ఫొటో పెట్టి, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి ఊరుకుంది.

ఆమె గర్భం దాల్చిందనే విషయం చాన్నాళ్లుగా మీడియాలో నలుగుతోంది. తను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిన వెంటనే కాజల్.. నాగార్జునతో చేస్తున్న సినిమా నుంచి తప్పుకుంది. అప్పట్నుంచి ఆమెపై పుకార్లు చెలరేగాయి. ఇన్నాళ్లకు వాటిపై ఇలా ఓ ఫొటోతో స్పష్టత ఇచ్చింది కాజల్.

నూతన సంవత్సర వేడుకల కోసం భర్త గౌతమ్ తో కలిసి గోవాలో ల్యాండ్ అయింది కాజల్. 2 రోజులుగా అక్కడే ఉంది. ఈ సందర్భంగా దిగిన ఫొటోను షేర్ చేసింది. ఆమె నటించిన ఆచార్య సినిమా వచ్చేనెల విడుదలకాబోతోంది.