ఎన్టీఆర్ ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకునే సినిమా

sree-vishnu

అర్జున ఫాల్గుణ సినిమాను ఎన్టీఆర్ అభిమానులు గొప్పగా చెప్పుకుంటారని అంటున్నాడు హీరో శ్రీవిష్ణు. సినిమాలో తను ఎన్టీఆర్ అభిమానిగా నటించానని చెప్పుకొచ్చాడు.

“నా ఫ్రెండ్స్ కామెడీ, ఫ్యామిలీ, బాయ్ నెక్స్ట్ డోర్ సినిమాలు చేయమని చెప్పేవారు. మాస్ సినిమాలు వద్దనే వారు. డిసెంబర్ 31 తర్వాత మీరు చెప్పండి నేను మాస్ సినిమాలకు పనికి వస్తానో రానో మీరు నిజాయితీగా చెప్పండి. సినిమాలో మేము జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. బయట తేజ జూనియర్‌కు పెద్ద ఫ్యాన్. అందరికి కోస్తే రక్తం వస్తుంది.. కానీ తేజకు జూనియర్ ఎన్టీఆర్ వస్తారు. ఆయన పేరు చెబితేనే తేజ ముఖం వెలిగిపోతుంది. సినిమా చూస్తే మేము కష్టపడి చేశామో లేదో మీకే తెలుస్తోంది.”

పనిలోపనిగా సినిమా స్టోరీని కూడా బయటపెట్టాడు శ్రీవిష్ణు. అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను తేజ మర్ని డైరక్ట్ చేశాడు. సుబ్బరాజు కీలక పాత్రలో కనిపించాడు.

“ఐదుగురు అమాయకులు, మంచి మనుసులున్న వ్యక్తుల వైన్ షాపు ఫ్రెండ్ షిప్. ఐదుగురు అమాయకులు చిన్న ఇదిలో ఇరుక్కుని ఎలా బయటపడ్డారనేది ఈ సినిమా. సినిమాలో చాలా చోట్ల పునకాలు వచ్చే ఎపిసోడ్లు ఉంటాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చాలా గర్వంగా చెప్పుకుంటారు.”

రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది అర్జున పాల్గుణ మూవీ. రాజరాజ చోర లాంటి సక్సెస్ తర్వాత శ్రీవిష్ణు నుంచి వస్తున్న సినిమా కావడంతో, ఓ మోస్తరు అంచనాలున్నాయి.