నాగచైతన్య నెక్ట్స్ స్టెప్ ఏంటి..?

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం నాగచైతన్య స్టయిల్. ఒకేసారి 2-3 సినిమాలు ఎనౌన్స్ చేసి, వాటిని చకచకా పూర్తిచేస్తుంటాడు ఈ అక్కినేని హీరో. ఓ సినిమా పూర్తయిన వెంటనే మరో సినిమాను పైప్ లైన్లో పెడుతుంటాడు. అయితే ఈసారి మాత్రం చైతూ ఆగిపోయాడు. ఏ దర్శకుడ్ని ఎంచుకోవాలో అర్థం కాక అలా ఉండిపోయాడు.

థాంక్యూ అనే సినిమా చేశాడు నాగచైతన్య. ఈ సినిమా షూట్ పూర్తయింది. మరోవైపు బంగార్రాజు అనే సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఈ రెండు సినిమాల తర్వాత చైతూ చేయాల్సిన మూవీపై అనుమానాలు ఎక్కువయ్యాయి. లెక్కప్రకారం.. నాంది దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి. కానీ అది క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆగిపోయింది.

ఈ గ్యాప్ లో నందినీరెడ్డి, వేణు ఊడుగుల, ఇంద్రగంటి మోహనకృష్ణ లాంటి దర్శకుల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ ఏదీ వర్కవుట్ కాలేదు. మరోవైపు శ్రీకాంత్ అడ్డాల పేరు కూడా వినిపిస్తోంది. కానీ నాగచైతన్య నుంచి ఇప్పటివరకు ఏ ప్రాజెక్టుకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ దక్కలేదు.