మనసుకు నచ్చిన సినిమా చేస్తున్న హీరోయిన్

nidhi-agerwal-stills

ప్రతి హీరోయిన్ కు ఓ ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ కు తగ్గట్టే అవకాశాలు కూడా వస్తుంటాయి. సదరు హీరోయిన్ కు ఆ ఇమేజ్ ఇష్టమా లేదా అనేది సగటు ప్రేక్షకుడికి అనవసరం. ఆమె తన ఇమేజ్ కు తగ్గ సినిమాలు మాత్రమే చేయాలని ప్రేక్షకులు కోరుకుంటారు. ఇన్నాళ్లూ హీరోయిన్ నిధి అగర్వాల్ అదే చేసింది. తన ఇష్టాఇష్టాల్ని పక్కనపెట్టి గ్లామర్ డాల్ పాత్రలు పోషించింది.

ఇన్నాళ్లకు నిధి అగర్వాల్ కు తన మనసుకు నచ్చిన కథ దొరికిందట. ఆ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది. బలమైన పాత్ర చేయాలనే కోరిక ఎప్పట్నుంచో ఉందని, తాజాగా అలాంటి కథ ఒకటి తన వద్దకు వచ్చిందని, ఆ ప్రాజెక్టుపై సైన్ కూడా చేశానని ప్రకటించింది. అదొక తమిళ సినిమా.

హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలంటే నిధి అగర్వాల్ కు చాలా ఇష్టం. కానీ ఇప్పటివరకు ఆమెకు అలాంటి పాత్రలు రాలేదు. ఫస్ట్ లాక్ డౌన్ టైమ్ లో ఆమె ఆన్ లైన్లో యాక్టింగ్ కోర్స్ కూడా చేసింది. ఇన్నాళ్లకు తనలోని నటిని ఆవిష్కరించే కథ దొరికిందని సంబరపడుతోంది అందాల నిధి.