‘ఆ అమ్మాయి’ కోసం మైత్రీ మూవీ మేకర్స్

హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రాబోతోన్న మూడవ‌ చిత్రం `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ కంపెనీ మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ.. ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామిగా చేరింది. ఈ విషయాన్ని బెంచ్ మార్క్ నిర్మాణ సంస్థ స్వయంగా ప్రకటించింది. రొమాంటిక్ ఎంటర్టైనర్, అందమైన ప్రేమ కథగా రాబోతోన్న ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్ట్ మీద మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఇక మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ ప్రాజెక్ట్‌లొకి రావడంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది.

ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను త్వరలోనే చిత్రయూనిట్ విడుదల చేయనుంది. వివేక్ సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. పీజీ విందా సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.