గోవాలో సమంత సందడి

నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక యాత్ర చేసింది సమంత. ఇప్పుడా బాధ నుంచి పూర్తిగా కోలుకొని సినిమాలతో బిజీ అయింది. అప్పుడు మానసిక ప్రశాంతత కోసం కాశీ లాంటి ప్రదేశాల్లో ఆధ్యాత్మిక యాత్ర చేసిన సమంత, ఇప్పుడు మానసిక ఉల్లాసం కోసం గోవా యాత్ర షురూ చేసింది.

తన బెస్ట్ ఫ్రెండ్స్ శిల్పారెడ్డి, వాసుకితో కలిసి గోవా వెళ్లింది సమంత. అక్కడి అందమైన జలపాతాల్లో ముగ్గురూ బికినీలు వేసుకొని స్నానాలు చేశారు. ఫొటోలకు పోజులిచ్చారు. ఈ విశేషాలన్నింటినీ గోవా డైరీస్ పేరిట సమంత తన సోషల్ మీడియా ఎకౌంట్ లో పెడుతోంది.

ఈ ఏడాది డిసెంబర్ 31 రాత్రిని గోవాలోనే ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకుంది సమంత. అందుకు తగ్గట్టే 4 రోజుల ముందే తన గ్యాంగ్ తో కలిసి గోవా చేరుకుంది. సంబరాలు షురూ చేసింది. ప్రస్తుతం సమంతను చూస్తుంటే, ఆమె తన వ్యక్తిగత సమస్యల నుంచి మానసికంగా పూర్తిగా బయటపడినట్టు కనిపిస్తోంది.

ప్రస్తుతం సమంత యశోద అనే సినిమాలో నటిస్తోంది. అటు తమిళ్ లో ఆమె కమిట్ అయిన సినిమా ఇంకా సెట్స్ పైకి రాలేదు. శాకుంతలం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ గ్యాప్ లో ఆమె చేసిన పుష్ప ఐటెంసాంగ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే.