బ్రేక్ ఈవెన్ సాధించిన అఖండ

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌ను అఖండ మరోసారి నిరూపించింది. తాజాగా ఈ సినిమా 25 రోజుల రన్ పూర్తి చేసుకుంది. నాలుగో వారంలో కూడా ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు వచ్చాయి. సినిమా ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది.

అఖండ భారీ సక్సెస్ సాధించడంతో చిత్రయూనిట్ విజయోత్సవాలు నిర్వహించింది. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో బాలకృష్ణ, బోయపాటి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి సహా చిత్రయూనిట్ అంతా పాల్గొంది. మరోవైపు బాలయ్య తన సినిమా సక్సెస్ అయిన సందర్భంగా దేవాలయాలకు వెళ్తున్నాడు. ఇందులో భాగంగా ఈరోజు యాదగిరిగుట్టలో దర్శనం చేసుకున్నాడు.

2021 బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది అఖండ. విడుదలైన అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతకు లాభాలను తెచ్చిపెట్టింది. బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా అఖండ నిలిచింది. ఓవర్సీస్‌లో వన్ మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసి రికార్డులు క్రియేట్ చేసింది. అఖండ విజయంతో టాలీవుడ్‌లో కొత్త ఆశలు చిగురించాయి.