మంత్రి అనిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. ఏపీలో కొడాలి నాని అన్నే ఫేమ‌స్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్య‌వ‌హారం చినికి చినికి గాలివాన‌గా మారుతోంది. టికెట్ల విష‌యంలో త‌ల‌దూర్చొద్దంటూ కొంద‌రు సినీ ప్ర‌ముఖులు అంటుంటే.. ప్ర‌జ‌ల సొమ్మును ప‌రిర‌క్షించాల్సిన బాధ్య‌త మాపై ఉందంటూ ఏపీ ప్ర‌భుత్వం బ‌దులిస్తోంది. సినిమా టికెట్ల వ్య‌వ‌హారంపై తాజాగా ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ స్పందించారు.

సినీ పరిశ్రమలో దోపిడీని అరికట్టేందుకే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి అనిల్అన్నారు. సినిమాకయ్యే ఖర్చులో 80 శాతం నలుగురి జేబుల్లోకి వెళ్తున్నాయ‌ని, దానికోసం కోట్లాది మంది ప్రజలపై భారంపడేలా సినిమా టికెట్‌ రేట్లు పెంచమనడం ఎంతవ‌ర‌కు క‌రెక్ట్ అని ప్ర‌శ్నించారు. ఇటీవ‌ల సినిమా హీరో నాని చేసిన వ్యాఖ్య‌ల‌పై కూడా ఘాటుగానే స్పందించారు. ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఒక్క‌రే నాని ఫేమ‌స్‌.. అది కొడాలి నాని అన్న అంటూ హీరో నానికి చుర‌క‌లంటించారు.

టికెట్‌ రేట్‌ తగ్గితే రెమ్యునరేషన్‌ తగ్గుతుందని వాళ్లు బాధపడుతున్నారు. వ‌కీల్‌సాబ్‌, భీమ్లా నాయక్ సినిమాల‌కు పెట్టిన ఖర్చెంత? పవన్‌కల్యాణ్‌ తీసుకున్న రెమ్యునరేషన్‌ ఎంత? పవన్‌ క్రేజ్‌ని అమ్ముకుంటున్నాడు. ప్రొడక్షన్‌ కాస్ట్‌ 30శాతం అయితే రెమ్యునరేషన్‌ 70శాతం ఉంది. 70 శాతం సినిమాకు ఖ‌ర్చు చేశాం.. రెమ్యున‌రేష‌న్ కు 30 శాతం పెట్టాం అంటే అర్థం ఉంది. ముగ్గురు, న‌లుగురి జేబుల్లోకి 80 శాతం వెళ్తుంటే.. అదంతా కోట్లాది మంది జ‌నాల మీద‌ రుద్దుతాం అంటే ఎంత వ‌ర‌కు క‌రెక్ట్‌. ఒకప్పుడు నేను కూడా పవన్‌కల్యాణ్‌కి కటౌట్‌లు కట్టాను. ఉన్న డబ్బులు ఊడగొట్టుకున్నాను. ఇప్పుడున్న అభిమానుల పరిస్థితి కూడా అంతే. ప్ర‌జ‌ల‌ను ఉద్ద‌రిస్తాన‌న్న ప‌వ‌న్.. త‌క్కువ రేటుకే వినోదాన్ని పంచొచ్చు క‌దా.. అని ప్ర‌శ్నించారు.