గోల్డెన్ శాండ్స్ ఆఫ్ రాజస్థాన్.. ఐఆర్సీటీసీ రాజస్థాన్ టూర్..

వింటర్‌లో రాజస్థాన్ అందాల్ని చూసేందుకు ఐఆర్సీటీసీ ఓ కొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. గోల్డెన్ శాండ్స్ ఆఫ్ రాజస్థాన్ అనే ఈ టూర్‌లో థార్ ఎడారి అందాల్ని వీక్షించొచ్చు. ఇంకా ఈ టూర్ వివరాలేంటంటే..

ఐఆర్సీటీసీ రాజస్థాన్ టూర్ ప్యాకేజీలో భాగంగా రాజస్థాన్‌లోని జైపూర్, జైసల్మేర్, జోధ్‌పూర్, పుష్కర్ వంటి ఎడారి నగరాలను సందర్శించొచ్చు. భారతీయ సంస్కృతి, హెరిటేజ్‌కు రాజస్థాన్ పెట్టింది పేరు. ఈ రాజస్థాన్ టూర్ ద్వారా రాజస్థాన్‌లోని ముఖ్యమైన ప్రాంతాలన్నింటిని కవర్ చేయొచ్చు. డిసెర్ట్ సిటీ జైసల్మేర్ నుంచి కల్చరర్ సిటీ జోధ్‌పూర్ వరకూ రాజస్థాన్ లోని కీలకమైన భూభాగాలన్నింటినీ చూసి రావొచ్చు.

టూర్ వివరాలివే..
ఈ టూర్‌లో జైపూర్, జైసల్మేర్, జోధ్‌పూర్, పుష్కర్ నగరాలు కవర్ అవుతాయి. ఈ టూర్ 5 రాత్రులు- 6 పగళ్లు ఉంటుంది. ప్రయాణీకులు జనవరి 10న ఫ్లైట్ ద్వారా జోధ్‌పూర్ చేరుకుని టూర్‌ను మొదలుపెడతారు. మళ్లీ జనవరి15న జైపూర్‌ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

ధరలు
ఈ టూర్ ప్యాకేజీ ధరలు ఇలా ఉన్నాయి. సింగిల్ షేరింగ్‌కు రూ.38950, డబుల్ షేరింగ్‌కు రూ.29950, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.29050 ఖర్చవుతుంది. ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి ఈ టూర్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

ఇవి ముఖ్యం
టూర్ కు వెళ్లాలనుకునే వారు తప్పనిసరిగా రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ పూర్తి చేసుకుని ఉండాలి. అలాగే 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్‌ను చూపించాల్సి ఉంటుంది.