పని పూర్తిచేసిన తీస్ మార్ ఖాన్

ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తీస్ మార్ ఖాన్. ఆర్ఎక్స్ 100 సినిమాతో ప్రేక్షకులను మైమరిపించిన పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి ఈ హై యాక్షన్ వోల్టేజ్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

కళ్యాణ్ జి గోగిణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదల కాగా దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలోని యాక్షన్ సీన్స్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నాయి. కాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది.

తీస్ మార్ ఖాన్ సినిమాలో ఆది సాయికుమార్ విలక్షణ పాత్ర పోషించాడట. అతడి లుక్ కూడా చాలా కొత్తగా ఉంటుందంటున్నారు. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు హైలెట్ అంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది.