సక్సెస్ ను క్యాష్ చేసుకోలేకపోయాను

హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ తన కెరీర్ పై స్పందించింది. టాక్సీవాలా లాంటి సక్సెస్ తర్వాత కూడా తన కెరీర్ ఊపందుకోకపోవడంపై రియాక్ట్ అయింది.

“టాక్సీవాలా సినిమా సక్సెస్‌ను వాడుకోలేకపోయానని కొంతమంది అంటారు. నాక్కూడా ఒక్కోసారి అనిపిస్తుంది. కానీ విధిని మనం మార్చలేం. కొన్ని సినిమాలు మనకు వద్దనుకున్నా వస్తాయి. ఎస్ఆర్ కళ్యాణమండపం, తిమ్మరుసు ఇంత హిట్ అవుతాయని నేను కూడా అనుకోలేదు. గమనం సినిమా కూడా హిట్ అవుతుందని అనుకుంటున్నాను.”

ఇలా తన కెరీర్ జర్నీని విశ్లేషించింది ప్రియాంక జవాల్కర్. హిట్, ఫ్లాప్స్ అనేవి కెరీర్ లో కామన్ అని, మనసుకు నచ్చిన కథ చేసుకుంటూ వెళ్లడం నేర్చుకున్నానని అంటోంది.

“సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తూ ఉంటే కెరీర్ స్లో అవుతుందనే భయం ఉంటుంది. అలా అని వచ్చిన సినిమాలన్నీ ఫటా ఫట్ చేస్తే ఫ్లాపులు వస్తే పరిస్థితి ఏంటనే భయం కూడా ఉంటుంది. అందుకే నాకు కథ నచ్చితేనే ఒప్పుకుంటాను. నాకు అందరు హీరోలతో పని చేయాలని ఉంది. ఓ లవ్ స్టోరీ సినిమా చేయాలని ఉంది. అందులో అయితే హీరోతో సమానంగా కారెక్టర్ ఉంటుంది.”

ఆమె నటించిన గమనం సినిమా ఈనెల 10న థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాలో ముస్లిం యువతి పాత్ర పోషించింది ప్రియాంక జవాల్కర్.