అఖండ ఫస్ట్ వీకెండ్ వసూళ్లు

అఖండ సినిమా హవా కొనసాగుతూనే ఉంది. నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల 37 లక్షల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 18 కోట్ల రూపాయలు కావాలి. వర్కింగ్ డే కాబట్టి ఈరోజు నుంచి ఆటోమేటిగ్గా అఖండకు వసూళ్లు తగ్గుతాయి.

అయితే అఖండ ఊపు ఈరోజు నుంచి పూర్తిగా పడిపోతుందా.. లేక వారాంతం వరకు ఓ మోస్తరుగా కొనసాగుతుందా అనేది ఆసక్తికర అంశం. పూర్తిగా పడిపోతే బ్రేక్ ఈవెన్ కష్టం. ఓ మోస్తరుగా నడిస్తే మాత్రం బ్రేక్ ఈవెన్ పెద్ద కష్టమేం కాదు. ఒకవేళ.. వీక్ డేస్ లో ఆడకపోయినా.. తిరిగి శని-ఆదివారాలు క్లిక్ అయినా సినిమా హిట్ అయినట్టే లెక్క.

తెలుగు రాష్ట్రాల్లో చలి పెరిగింది. కాబట్టి ఈవెనింగ్, సెకెండ్ షోలకు ఆక్యుపెన్సీ మరింత పడిపోయేలా ఉంది. విడుదలైన ఈ 4 రోజుల్లో (మొదటి వారాంతం) ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు చూద్దాం.

నైజాం – రూ. 12.06 కోట్లు
సీడెడ్ – రూ. 8.80 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.72 కోట్లు
ఈస్ట్ – రూ. 2.55 కోట్లు
వెస్ట్ – రూ. 2.04 కోట్లు
గుంటూరు – రూ. 3.24 కోట్లు
నెల్లూరు – రూ. 1.70 కోట్లు
కృష్ణా – రూ. 2.26 కోట్లు