హైదరాబాద్ లో ఘోరం : భర్తకు మద్యం తాపించి భార్యపై హత్యాచారం..!

హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తులు కలిసి ఓ వ్యక్తికి మద్యం తాపించి అతడి భార్య పై అత్యాచారం చేసి హత్య చేశారు. సంచలనం సృష్టించిన ఈ దారుణ సంఘటన హయత్ నగర్ సమీపంలోని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తారామతిపేట్ లోని ఓ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మంగళవారం తనకు తెలిసిన ఇద్దరు వ్యక్తులను ఇంటికి తీసుకువచ్చాడు. ముగ్గురు కలిసి ఇంట్లోనే మద్యం సేవించారు. ఆ వ్యక్తి మద్యం అతిగా సేవించి స్పృహ కోల్పోయాడు.

దీంతో ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తుల కన్ను అతడి భార్య పై పడింది. వారిద్దరూ కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను చంపేసి అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు.

అదే ప్రాంతానికి చెందిన సురేష్, శ్రీకాంత్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు వారి విచారణలో తేలింది. పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టి సురేష్ ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న శ్రీకాంత్ కోసం గాలింపు నిర్వహిస్తున్నారు. తెలిసిన వారే ఇంటికొచ్చి దారుణానికి ఒడిగట్టడంపై స్థానికులు నివ్వెరపోతున్నారు. ఈ హత్యాచార సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది.