షాకింగ్ : చెల్లిని చంపిందని తల్లిని చంపిన కొడుకు..!

కుమార్తె సెల్ ఫోన్ కు బానిస అయిందని ఆగ్రహించిన తల్లి ఆమె మెడకు చున్నీ బిగించి చంపింది. ఇది చూసిన కొడుకు.. చెల్లిని చంపిందన్న కోపంతో తల్లిని కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణ సంఘటన కడప జిల్లాలో జరిగింది. కడప నగరంలోని నకాష్ వీధిలో ఖుర్షీదా అనే మహిళ కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తోంది. కాగా ఖుర్షీదా కుమార్తె అలీమా(14) సెల్ ఫోన్ కు బానిసగా మారింది.

నిత్యం గంటల తరబడి ఫోన్ చూస్తుండడంతో తల్లి కి కోపం వచ్చింది. మరోసారి సెల్ ఫోన్ ముట్టవద్దని బెదిరించడం కోసం ఖుర్షీదా అలీమా మెడకు చున్నీతో ఉరివేయబోయింది. అయితే ఊహించని విధంగా చున్నీ అలీమా మెడకు బిగుసుకుపోయి ఆమె మృతి చెందింది. తన కళ్లెదుటే చెల్లిని తల్లి చంపడంతో ఖుర్షీదా కొడుకు జమీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కత్తితో తల్లిని పొడిచి చంపి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో కలసి ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ కు తరలించారు. తన చెల్లిని చంపిందన్న కోపంతో తల్లిని తానే హత్య చేసినట్లు నిందితుడు జమీర్ అంగీకరించాడు. క్షణికావేశానికి ఇద్దరు బలైన సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.