తెలుగు సినిమాలో తమిళ హీరో విజయ్

తమిళ స్టార్ హీరో విజయ్, తెలుగు డైరక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో సినిమా రాబోతోందనే విషయం కొన్ని రోజుల కిందట అన్-అఫీషియల్ గా పక్కా అయింది. ఇప్పుడీ సినిమాను అధికారికంగా ప్రకటించారు. దళ‌ప‌తి విజయ్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ పై అటు ప్రేక్ష‌కుల్లో ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో విప‌రీత‌మైన బ‌జ్ నెల‌కొని ఉంది. సినిమా రంగం ప‌ట్ల అభిరుచి, నైపుణ్యం క‌లిగిన వ్యక్తుల క‌ల‌యిక‌తో ఈ సినిమా ఒక క్రేజీ ప్రాజెక్ట్‌గా మారింది.

అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విజ‌య్‌. తుపాకీ సినిమా నుంచి టాలీవుడ్ లో కూడా విజయ్ క్రేజ్ పెరుగుతూ వస్తోంది. ఎట్టకేలకు కెరీర్ లో తన తొలి స్ట్రయిట్ మూవీని ఎనౌన్స్ చేశాడు ఈ స్టార్ హీరో. విజయ్ కెరీర్ లో 66వ సినిమాగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో ఈ సినిమా రాబోతోంది.

ప్ర‌స్తుతం విజ‌య్ నెల్స‌న్ ద‌ర్శ‌కత్వంలో చేస్తోన్న తన 65వ చిత్రం `బీస్ట్` పూర్తికాగానే వంశీ పైడిపల్లి
దర్శకత్వంలో మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. రష్మిక
పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.