హీరోయిన్ గా దర్శకుడు శంకర్ కూతురు

సౌత్ ఇండియా స్టార్ డైరక్టర్ శంకర్ చిన్న కుమార్తె అదితీ శంకర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. అయితే.. తండ్రి శంకర్ సినిమాతో ఈ ఎంట్రీ ఇవ్వడం లేదు. కార్తీ హీరోగా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న విరుమన్ సినిమాలో అదితీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై హీరో సూర్య, జ్యోతిక దంపతులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా అదితీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.

తన కూతురు అదితిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నందుకు దర్శకుడు శంకర్, సూర్యకు థ్యాంక్స్ చెప్పాడు. తన కూతురు చాలా ప్రిపేర్ అయిందని, ప్రేక్షకులంతా ఆమెపై ప్రేమ కురిపించాలని కోరాడు. అటు అదితి కూడా సూర్య-జ్యోతికకు థ్యాంక్స్ చెబుతూనే, వంద శాతం కష్టపడి అందరూ గర్వించేలా చేస్తానని తెలిపింది.

వారసులు వెండితెరపైకి రావడం సహజం. కానీ వారసురాళ్లు హీరోయిన్లుగా మారడం చాలా తక్కువ. నిహారిక కొణెదల, శృతిహాసన్, వరలక్ష్మి లాంటి చాలా కొద్దిమంది మాత్రమే ఇలా ప్రయత్నించారు. ఇప్పుడీ లిస్ట్ లోకి అదితి కూడా చేరింది.