రాజా విక్రమార్క టీజర్ రివ్యూ

వరుస సినిమాలతో నిరాశ పరుస్తూ వస్తున్న యంగ్ హీరో కార్తికేయ ఈసారి ‘రాజా విక్రమార్క’ అనే ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీ సారిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. బ్యాక్ గ్రౌండ్ లో ఓల్డ్ హిందీ సాంగ్ వస్తూ కార్తికేయ విజువల్ తో స్టార్టయిన టీజర్ లో సినిమా ఎలా ఉండబోతుందనేది క్లియర్ కట్ గా చెప్పేశారు.

సినిమాలో సీక్రెట్ మిషన్ హ్యాండిల్ చేసే NIA ఆఫీసర్ గా కనిపించనున్నాడు కార్తికేయ. తన క్యారెక్టరైజేషన్ లో ఫన్ కూడా ఉంటుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. బుల్లెట్ కాల్చాక కార్తికేయ “సారీ బాబాయ్ చూసుకోలేదు” అని చెప్పడం… దానికి తనికెళ్ళ భరణి “ఏదో కాలు తొక్కినంత ఈజీగా చెప్పావేంట్రా ?” అనడం అలాగే టీజర్ ఎండింగ్ లో “చిన్నప్పుడు కృష్ణ గారిని పెద్దయ్యాక టామ్ క్రూస్ ని చూసి ఆవేశ పడి జాబ్ లో జాయిన్ అయిపోయాను కానీ సరదా తీరిపోతుంది” అంటూ చెప్పడం ఫన్ జెనరేట్ చేసింది.

అలాగే సినిమాలో కార్తికేయ ఓ నైజీరియన్ ని అనుకోకుండా చంపుతాడని తనికెళ్ళ భరణి పాత్ర ద్వారా టీజర్ లో చెప్పించాడు దర్శకుడు. అసలు అతను ఎవరు ? హీరో ఎలాంటి మిషన్ హ్యాండిల్ చేశాడు ? అనేది స్క్రీన్ పైనే చూడాలని హింట్ ఇచ్చాడు దర్శకుడు. అలాగే సినిమాలో మంచి యాక్షన్ ఉందనే విషయాన్ని కూడా టీజర్ లో చూపించారు.

ఆదిరెడ్డి సమర్పణలో రామరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో కార్తికేయ సరసన తన్య రవీంద్రన్ హీరోయిన్ గా నటిస్తుంది. సాయి కుమార్ , తనికెళ్ళ భరణి ,సుధాకర్ కొమాకుల ,హర్షవర్ధన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి మ్యూజిక్ కంపోజ్ అందిస్తున్నాడు.