ఈ శుక్రవారం సినిమాలు

థియేటర్లు తెరుచుకున్న మరుక్షణం చిన్న సినిమాలు క్యూ కట్టాయి. గత వారం 5 సినిమాలు రిలీజ్ కాగా..
ఈవారం 6 సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. వాటిలో కాస్త అంచనాలతో వస్తున్న సినిమాలు ఎస్ఆర్ కల్యాణమండపం, ఇప్పుడుకాక ఇంకెప్పుడు సినిమాలు మాత్రమే.

కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఎస్ఆర్ కల్యాణమండపం.
సినిమాలో పాటలు బాగా హిట్టయ్యాయి. అందుకే సినిమాపై అంచనాలు పెరిగాయి. సాయికుమార్, హీరో
తండ్రిగా నటించిన ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి.

ఇక చిన్న సినిమాగా వస్తున్న ఇప్పుడుకాక ఇంకెప్పుడు కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. పైగా ఈ సినిమా రీసెంట్ గా వివాదాస్పమైంది కూడా. భజగోవిందం అనే ఆడియోను, ఓ రొమాంటిక్ సీన్ పై ప్రసారం చేసి వివాదం సృష్టించాడు దర్శకుడు.

ఇక వీటికి పోటీగా వస్తున్న మరో చిన్న సినిమా ముగ్గురు మొనగాళ్లు. శ్రీనివాసరెడ్డి లీడ్ రోల్ పోషిస్తున్న ఈ
సినిమా కంప్లీట్ కామెడీ ఎలిమెంట్స్ తో వస్తోంది. మూగవాడు, గుడ్డివాడు, చెవిటివాడు అయిన ముగ్గురు
వ్యక్తులు, హత్య కేసును ఎలా ఛేధించారనేది ఈ సినిమా స్టోరీ.

ఈ సినిమాలతో పాటు క్షీరసాగరమధనం, మెరిసే మెరిసే, మ్యాడ్ సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. లాస్ట్ వీక్ వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఈ వారమైనా ఓ హిట్ సినిమా పడుతుందేమో చూడాలి.