వివాహ భోజనంబు ట్రయిలర్ రివ్యూ

కమెడియన్ సత్య హీరోగా నటించిన “వివాహ భోజనంబు” సినిమా ట్రైలర్ రిలీజైంది. ఆద్యంతం నవ్విస్తూ
సాగిన ఈ ట్రైలర్ ను ‘సోని లివ్’ ఓటీటీ విడుదల చేసింది. త్వరలో ‘సోని లివ్’ ఓటీటీ ద్వారా “వివాహ
భోజనంబు” సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది.

“వివాహ భోజనంబు” మూవీ ట్రైలర్ చూస్తే… తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకోవాలని చూసిన పిసినారి పెళ్లి
కొడుక్కి లాక్ డౌన్ పిడుగుపాటులా మీద పడుతుంది. పెళ్లికి వచ్చిన బంధువులంతా ఇంట్లోనే 21 రోజుల పాటు ఉండిపోవాల్సి వస్తుంది. అసలే పిసినారి అయిన కథానాయకుడు వాళ్లకు పెట్టే ఖర్చులు తట్టుకోలేకపోతాడు. క్రికెట్ టీమ్ లా ఇంట్లో ఉండిపోయిన ఈ బంధువులను వదిలించుకోలేక అతను పడే పాట్లు నవ్వించాయి. ట్రైలర్ లోనే ఇన్ని నవ్వులు ఉంటే, సినిమాలో ఇక బోలెడన్ని నవ్వులు ఖాయం

ఈ సినిమాను సందీప్ కిషన్ నిర్మిస్తూ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తుండటం విశేషం. వాస్తవ ఘటనల స్ఫూర్తితో
“వివాహ భోజనంబు” చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు రామ్‌ అబ్బరాజు. నూతన తార అర్జావీ రాజ్
హీరోయిన్ గా నటించింది.