నిహారిక భర్తపై పోలీస్ కేసు

నిహారిక కొణెదల భర్త, నాగబాబు అల్లుడు చిక్కుల్లో పడ్డాడు. చైతన్య జొన్నలగడ్డపై పోలీస్ కేసు నమోదైంది. అది కూడా న్యూసెన్స్ కేసు. హైదరాబాద్ లోని ఓ అపార్ట్ మెంట్ వాసులు చైతన్యపై ఈ కేసు పెట్టారు. దీనికి బదులుగా చైతన్య కూడా అపార్ట్ మెంట్ పై కేసు పెట్టాడు..

ఇంతకీ మేటర్ ఏంటంటే.. తమ వృత్తిగత పనుల కోసం ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకున్నారు
నిహారిక-చైతన్య. ఫిలింనగర్ నుంచి షేక్ పేట్ వైపు వెళ్లే దారిలో ఇది ఉంది. ఈ ఫ్లాట్ లో చైతన్య కోసం
గుంపులు గుంపులుగా జనం వస్తున్నారట. ఎవ్వరూ కరోనా నిబంధనలు కూడా పాటించడం లేదంట. పైగా
రాత్రిపగలు తేడా లేకుండా ఇరుగుపొరుగు వారిని డిస్టర్బ్ చేస్తున్నారట.

అందుకే అంతా కలిసి వెళ్లి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. వీళ్లు ఆరోపిస్తున్న అంశాల్లో
మరో కీలకమైన అంశం కూడా ఉంది. నివాసానికి మాత్రమే ఉపయోగించాల్సిన ఫ్లాట్స్ లో చైతన్య, వ్యాపార
కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని.. అందుకు అనుమతి లేదని చెబుతున్నారు. చూస్తుంటే.. కేసు అపార్ట్
మెంట్ వాసుల వైపే ఎక్కువ బలంగా ఉన్నట్టుంది.